ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

TG: నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి (M)లో విషాదం చోటు చేసుకుంది. దేవరోని తండా గ్రామానికి చెందిన ఇస్లావత్ రాజు తండ్రి కొటియాకు మేఘన పౌల్ట్రీ ఫాంలో పనిచేయుటకు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దిలీప్ కుమార్, అతని భార్య సంగీత వచ్చారు. శుక్రవారం రాత్రి సంగీత ఫోన్ కి వేరే వ్యక్తి ఫోన్ నంబర్ నుంచి మెసేజ్ రాగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శనివారం ఇంట్లో భర్త లేని సమయం చూసి ఆమె ఉరివేసుకొని మృతి చెందింది. పౌల్ట్రీ ఫాం యజమాని  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్