పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

TG: పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYDలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లి, పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లికి చెందిన అనిల్ కుమార్ తో అదే ప్రాంతానికి చెందిన సౌజన్య (27)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అనిల్ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, సౌజన్య ఇంటి వద్దే ఉంటుంది. పెళ్లై రెండేళ్లు గడుస్తున్నా వీరికి పిల్లలు కలగలేదు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన సౌజన్య ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత పోస్ట్