పిల్లలు లేరని మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య

TG: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లలు లేరనే మనస్తాపంతో 48 ఏళ్ల వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఊర్మిళ తనకు సంతానం కలగకపోవడంతో తరచూ బాధపడేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శనివారం పొలం వద్దకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన ఆమె, గ్రామ సమీపంలోని చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్