నీటి సంపులో పడి వివాహిత మృతి

AP: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో చోటు చేసుకుంది. శంకర్‌నగర్‌కు చెందిన లలితమ్మ (54)కు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం మంచినీటి సంపు నిండి నీరు వృథాగా రోడ్డుపైకి పోతుండటంతో ఆమె గేట్ వాల్వ్ బంద్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాలు జారి సంపులోకి పడిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు సంపులో తేలియాడుతున్న లలితమ్మను వెలికితీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్