ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌లో ఒక వివాహిత మహిళపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఆమె మాజీ ప్రియుడు వికాస్, తన స్నేహితులతో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెను చంపి బాత్రూంలో పడేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు వికాస్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.