మార్ఫింగ్‌ ఫొటోలతో వివాహితకు వేధింపులు

AP: విశాఖపట్నంలో ఫేస్‌బుక్, వాట్సాప్‌ చిత్రాలను మార్ఫింగ్‌ చేసి ఓ వివాహితను వేధిస్తున్న నిందితుడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో, వ్యక్తిగత వీడియోలు, మెసేజ్‌లను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎన్‌టీఆర్‌ జిల్లాకు చెందిన వనరాసి శంకర్‌రావును నిందితుడిగా గుర్తించి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్