TG: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను శివ(25), రేణుక(22)గా గుర్తించారు. రేణుక వారం క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. పెళ్లికి ముందు పరిచయం ఉన్న శివతో కలిసి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.