మారుతి సుజుకీ మరోసారి కార్ల ధరలను పెంచింది. పలు మోడళ్లపై సగటున 0.31 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మూడుసార్లు ధరలు పెంచిన మారుతి, తాజా పెంపుతో కలిపి మొత్తం 1 శాతం వరకు రేట్లు పెంచినట్లు PTI పేర్కొంది.