మారుతి విక్టోరిస్‌ ‘ఆరమ్‌’ ఎడిషన్‌ విడుదల

మారుతి సుజుకి తన విక్టోరిస్‌ ఎస్‌యూవీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ‘ఆరమ్‌ ఎడిషన్‌’ను విడుదల చేసింది. స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌ ఆధారంగా రూపొందించిన ఈ ఎడిషన్‌కు రూ.22,990 ధరతో ప్రత్యేక యాక్సెసరీ కిట్‌ అందిస్తోంది. కాపర్‌ ఇన్‌సర్ట్‌లు, క్రోమ్‌ అలంకరణలు, 3డీ క్యాబిన్‌, బూట్‌ మ్యాట్లు ఇందులో ప్రత్యేకతలు. ఇంజిన్‌లో మార్పుల్లేవు. విక్టోరిస్‌ సాధారణ మోడళ్ల ఎక్స్‌-షోరూమ్‌ ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి. తొలి ఏడాదిలో 1,47,602 యూనిట్లు అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕