మసూద్ అజార్ సోదరుడు అన్వర్ అనుమానాస్పద మృతి

పాకిస్థాన్‌లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాహీర్ అన్వర్ మరణాన్ని ఆ సంస్థ అధికారిక ఛానెల్ ద్వారా ధృవీకరించింది. సోమవారం అర్థరాత్రి బహావల్‌పూర్‌లోని ‘జామియా మసీదు ఉస్మాన్ వలీ’లో అతని అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. తాహిర్ అన్వర్ జైష్-ఎ-మొహమ్మద్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. కాగా తాహిర్ అన్వర్ మరణానికి గల కారణంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్