కర్ణాటకలో నకిలీ మందుల విక్రయాలపై ఆహార, ఔషధ నియంత్రణ శాఖ చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన 16 రిటైలర్లు, హోల్సేలర్ల ఔషధ లైసెన్సులను రద్దు చేయగా.. మరో 8 లైసెన్సులను సస్పెండ్ చేసింది. బిడది సమీపంలోని ఫామ్‌హౌస్‌లో రూ.5.05 కోట్ల విలువైన నకిలీ మందులు, ప్యాకింగ్ సామగ్రి, యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు మందులు కొనుగోలు చేసి కొత్త ప్యాకెట్లలోకి మార్చి ఖరీదైనవిగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.