ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ బైనాన్స్‌పై అక్టోబరు 30న భారీ సైబర్ దాడి జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. హ్యాకర్లు 10 బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లలోని వాలెట్ల నుంచి సుమారు 6.36 బిలియన్ డాలర్ల (రూ.56 వేల కోట్లకు పైగా) విలువైన డిజిటల్ ఆస్తులను తరలించినట్లు టీఆర్‌ఎం ల్యాబ్స్ తెలిపింది. ఈ లావాదేవీల్లో ఎక్కువ భాగం కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పేర్కొంది. ఉత్తర కొరియాతో సంబంధాలున్న ట్రేడర్‌ట్రైటర్ హ్యాకింగ్ ముఠా ప్రమేయం ఉండొచ్చని టీఆర్‌ఎం ల్యాబ్స్, చైన్ అనాలిసిస్ అనుమానిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ లేదు.