పనామా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 భూకంప తీవ్రత నమోదైంది. ఆయా చోట్ల పలుమార్లు భూప్రకంపనలు వచ్చాయి. లా పిటలోజాలో 12.6 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటనలో అనేక భవనాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.