భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది ఉగ్రవాదులు హతం

మణిపూర్‌ చందేల్‌లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. చందేల్ జిల్లాలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని న్యూ సమతాల్ గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీన్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది ఉగ్రవాదులు హతమైనట్లు తూర్పు కమాండ్ ట్వీట్ చేసింది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్