ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కొంటా కిస్సారం అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు సమాచారం. 3 ఏకే 47లతో పాటు భారీగా ఆయుధాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కొంటా ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ మగ్దూ ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.