భారీ అగ్నిప్రమాదం.. అన్నదమ్ములు సజీవదహనం (వీడియో)

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా గ్రామీణ ప్రాంతంలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక గదిలో నిద్రిస్తున్న ముగ్గురు అన్నదమ్ములలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపే మంటలు గది మొత్తాన్ని చుట్టుముట్టాయి. శనివారం రాత్రి బంధువు ఇంటికి వెళ్లిన దేవీలాల్ కుమారుడు జస్రమ్ (21), అతని బంధువులు అరుణ్ (19), రాజు (12) ఒకే గదిలో నిద్రిస్తుండగా, తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు పోలిసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్