మహారాష్ట్ర నవీ ముంబైలోని ఉన్న మెఫ్కో మార్కెట్‌లోని ఆయిల్ గోదాంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆయిల్ నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.