అడిడాస్‌లో భారీ ఉద్యోగ కోతలు

ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ సంస్థ అడిడాస్‌ భారత్‌లోని టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాల కోతకు పూనుకుంది. గురుగ్రామ్‌లోని టెక్‌ హబ్‌లో పనిచేస్తున్న సుమారు 700 మందిలో 300-350 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 15న టౌన్‌హాల్‌లో ఉద్యోగులకు పునర్వ్యవస్థీకరణ నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆపరేటింగ్‌ మోడల్‌ను సరళీకృతం చేయడానికే ఈ మార్పులని అడిడాస్‌ తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕