అమెజాన్ లో 16 వేల మంది ఉద్యోగులపై వేటు!

అమెజాన్ సంస్థలో ఉద్యోగ కోతలు ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్‌లో 2,198 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. 2026లో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ టీమ్‌లపై ప్రభావం ఎక్కువగా ఉంది. మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయిల్లోనూ ఉద్యోగాలు తగ్గడంతో నాయకత్వ స్థాయిలు తగ్గుతున్నాయి. ఏప్రిల్ 28 నుంచి జూన్ చివరి వరకు స్వచ్ఛంద పదవీ విరమణలు కొనసాగుతాయి. సంస్థలో నిర్మాణాత్మక మార్పులు, ఖర్చుల నియంత్రణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ తెలిపింది.

సంబంధిత పోస్ట్