సిక్కింలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పశ్చిమ సిక్కింలోని యుక్సోమ్-తాషిడింగ్ నియోజకవర్గం పరిధిలోని రింబి గ్రామంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గ్రామం మొత్తం శిథిలాల కింద చిక్కుకుపోయింది. విస్తృతంగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు.