హైదరాబాద్‌లోని మణికొండ, పుప్పాలగూడలో పెట్రోల్ కొరత కారణంగా కొన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో, పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పుప్పాలగూడలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరడంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.