"The Institute of Cost Accountants of India" వారు నిన్న అనగా ది.08-07-2025 న ప్రకటించిన CMA ఫలితాలలో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ర్యాంకుల ప్రభంజనాన్ని సృష్టించారు. CMA ఫౌండేషన్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 10 ర్యాంకులను మాత్రమే ప్రకటించటం జరుగుతుంది. ఈ 10 ర్యాంకులలో 11 ర్యాంకులను మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ CA మట్టుపల్లి మోహన్ పత్రికా విలేకర్ల సమావేశంలో తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించిన ఆల్ ఇండియా ర్యాంకులు వరుసగా 4, 5, 6, 6, 8, 8, 8, 9, 9, 10, 10. సేమ్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు సేమ్ ర్యాంక్ ఇవ్వటమనేది జరుగుతుంది. ఈ విధంగా అఖిల భారత స్థాయిలో 10 ర్యాంకులలో 11 ర్యాంకులను మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఇలాంటి ఘన విజయాన్ని మాకు అందించినటువంటి విద్యార్థులకు, సహకరించినటువంటి వారి తల్లిదండ్రులకు మరియు టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ కు మోహన్ ధన్యవాదాలు తెలియజేశారు.