భారత్‌తో జరుగుతున్న రెండో T20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. హ్యారీ(53) హాఫ్ సెంచరీతో రాణించారు. టిమ్ టెక్టర్(5), అడైర్(16), టక్కర్ (15), కాలిట్జ్ (47), డాక్రెల్ (19), మెక్‌కార్తీ (2) పరుగులు చేశారు. భారత బౌలర్లు ప్రిన్స్ యాదవ్ 3, శివమ్ దూబె, హర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.