మెన్స్ అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని పాక్ 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హమ్జా జహూర్(100*) సెంచరీతో చెలరేగాడు. అబ్బాస్ దార్(38), అబ్దుల్ ఖాదిర్(20), ఉస్మాన్ ఖాన్(16) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు మనాల్ చౌహాన్ 3, మోహిత్ ఉల్వ 2, ఇషాన్ సూద్, కావ్యపటేల్ చెరో వికెట్ తీశారు.