కేటీఆర్‌తో మారిషస్‌ విదేశాంగ సహాయ మంత్రి భేటీ

TG: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావుతో మారిషస్‌ విదేశాంగ, వాణిజ్యశాఖ సహాయ మంత్రి హంబైరాజన్‌ నర్సింఘెన్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కేటీఆర్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత దశాబ్దకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధిపై చర్చించారు. అలాగే, భవిష్యత్‌లో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య విస్తరణకు ఉన్న అవకాశాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు బీఆర్‌ఎస్‌ నేత తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్