మావిగన్ రాజధానిగా సరైనదే: వైఎస్‌ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని విషయంలో మావిగన్‌ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతం) సరైన, ఆచరణాత్మక పరిష్కారం అని మరోసారి స్పష్టం చేశారు. ప్లాన్‌ ఏ కింద విశాఖపట్నం, కర్నూల్‌, అమరావతిలను సూచించామని, అది వద్దనుకుంటే ప్లాన్‌ బీగా మావిగన్‌ను సూచించామని తెలిపారు. గత ఎన్నికల మేనిఫెస్టో హామీలు మోసాలుగా తేలిపోయాయని, రెండేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్