ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి: మాయావతి

పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. అయితే ఈ కోటాలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె కోరారు. మరోవైపు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆమె తీవ్రంగా ఆరోపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕