నేను ఎదుర్కొన్న టఫెస్ట్‌ బ్యాటర్లు వీరే: గ్లెన్ మెగ్రాత్

ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ఐదుగురు బ్యాటర్ల జాబితాను వెల్లడించాడు. వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారాను అగ్రస్థానంలో నిలబెట్టగా, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు రెండో స్థానం ఇచ్చాడు. వీవీఎస్ లక్ష్మణ్ మూడో స్థానంలో, ఏబీ డివిలియర్స్ నాలుగో స్థానంలో, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు గ్రాహం థోర్ప్ ఐదో స్థానంలో నిలిచారు. అంతకుముందు అరవింద డిసిల్వ, కెవిన్ పీటర్సన్, అలిస్టర్ కుక్, సయీద్ అన్వర్, వీరేందర్ సెహ్వాగ్‌లను కూడా మెగ్రాత్ తన జాబితాలో చేర్చగల సత్తా ఉన్న బ్యాటర్లుగా పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్