దీపావళి పండుగ సీజన్ ముగియడంతో కేంద్రం త్వరలోనే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) విధించేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి అక్టోబర్ 15 నుంచే దీనిని అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యోచించినప్పటికీ, వ్యాపారుల విన్నపం మేరకు పండుగ సీజన్ ముగిసే వరకు వాయిదా వేసింది. నిబంధనల ప్రకారం.. ఒక దుకాణంలో రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు జరిగితే, దుకాణాదారులు ఆ మొత్తంపై 0.4 శాతం MDR చెల్లించాల్సి ఉంటుంది. అమలు తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.