లక్షలాది ప్రాణాలను కాపాడిన మీజిల్స్‌ టీకా: WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, వ్యాక్సిన్ విస్తృత పంపిణీతో గత 24 ఏళ్లలో మీజిల్స్ మరణాలు 88% తగ్గాయి. ఈ టీకా ద్వారా 59 మిలియన్ల చిన్నారుల ప్రాణాలు రక్షించబడ్డాయి. 2000లో 7,77,000 మరణాలు నమోదు కాగా, గతేడాది 95,000 మంది చిన్నారులు మరణించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని WHO పేర్కొంది. 2019తో పోలిస్తే గతేడాది కేసులు 8 లక్షలు అదనంగా నమోదయ్యాయి. తూర్పు మధ్యధరా, యూరోపియన్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కేసులు పెరిగాయి.

సంబంధిత పోస్ట్