ఐఫోన్‌లో కొలతల యాప్‌

ఐఫోన్‌ 6ఎస్, ఆ తర్వాతి మోడళ్లలోని మెజర్‌ యాప్‌లో ఇన్‌బిల్ట్‌గా స్పిరిట్‌ లెవల్‌ అనే ఫీచర్‌ సైతం ఉంది. ఏదైనా వస్తువు నేలకు లంబంగా ఉందో లేదో దీని ద్వారా చూసుకోవచ్చు. గోడ మీదున్న పెయింటింగ్‌ నిలువుగా, అడ్డంగా తిన్నగా ఉందో లేదో కొలుచుకోవచ్చన్నమాట. ఐఫోన్‌లో మెజర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అడుగున ఉండే ‘లెవల్’ ట్యాబ్ మీద తాకాలి. తిన్నగా ఉందో లేదో తెలుసుకోవాలనే వస్తువుకు ఎదురుగా ఐఫోన్ పట్టుకోవాలి. తెర మీద 0 డిగ్రీలని చూపిస్తుంది. దాని ప్రకారం ఫోన్ తిప్పడమే తరువాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్