ముందు వెళ్తున్న లారీని ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌటకూర్ మండలం శివంపేట వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. సంగారెడ్డి నుంచి జోగిపేట వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.