అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ప్రకటనలో దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారంతా సురక్షితంగా బయటపడాలని మంత్రి ప్రార్థించారు. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, గుజరాత్ ప్రభుత్వానికి మంత్రి విజ్ఞప్తి చేశారు.