ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పుల్కల్ మండలం గొంగులూర్ గ్రామం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్సై క్రాంతి కుమార్ కథనం ప్రకారం.. బైక్లు ఢీకొనడంతో తాడ్ డాన్ పల్లి గ్రామానికి చెందిన యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్ పై ఉన్న రాజు, అర్జున్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.