రాయికోడ్ మండలం రామోజీ పల్లికి చెందిన గొల్ల అంజయ్య (62) అదృశ్యమైనట్టు ఎస్ఐ నారాయణ ఆదివారం తెలిపారు. మార్చి 16 నుంచి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. ఇతని ఒంటిపై మెరున్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ పాయింట్ ధరించి ఉన్నాడు. ఎత్తు 5 1/2 ఫీట్లు, చామన ఛాయ ఉంటాడని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.