పుల్కల్: విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి

పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో పొలం వద్ద రైతు రమావత్ రమేష్ (33) శుక్రవారం రాత్రి మృతి చెందారు. గాలి వాన బీభత్సం రావడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కరెంటు సరఫరా పునరుద్ధరించలేదని అధికారులు చెప్పడంతో రైతు రమేష్ శుక్రవారం రాత్రి పొలానికి వెళ్ళాడు. అక్కడే విద్యుత్ షాక్ తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ క్రాంతి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్