అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం ధర్మాజీపేట వార్డుకు చెందిన పోతిగంటి నర్సింలు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ భార్య మణెవ్వ, కొడుకు, కూతురుతో జీవిస్తున్నాడు. కూతురు పెళ్లి కోసం దాదాపు రూ. 4 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.