అనారోగ్య సమస్యలు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారంలో చోటు చేసుకుంది. గురువారం హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ వివరాల ప్రకారం ధర్మారం గ్రామానికి చెందిన చెప్యాల రాజు, గౌరమ్మ దంపతుల కుమార్తె సౌమ్య రెండేళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరి వేసుకుంది. కేసు దర్యాప్తులో ఉంది.