తొగుట: దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు శుక్రవారం తొగుట సీఐ లతీఫ్ తెలిపారు. జనవరి నుంచి ఈ నెల 11 వరకు జరిగిన జిల్లాలో ఆయా దొంగతనాలకు సంబంధించిన ఆరుగురి సభ్యుల ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా చీమలపాడుకు చెందిన రమేశ్, మహబూబాబాద్ ఆమనగల్ కు చెందిన నర్సయ్యలను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్