కొండపాక: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొండపాక 108 సిబ్బంది మహేందర్, శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణానికి చెందిన కనకచారి, రత్నమాల దంపతులు బైకుపై చేర్యాలలో బంధువుల పెళ్లికి వెళుతున్నారు. ఈ క్రమంలో వీరి బైకును వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కింద పడ్డారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్