సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారిపై గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కారులో ఉన్న ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు మరోకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.