తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ రేపటి నుంచి ప్రారంభమవుతుందని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతన్నల కష్టాలు తొలగిపోతాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.