మెదక్: 'సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలి'

మెదక్ పట్టణంలో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు పిలుపునిచ్చారు. మెదక్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద మంగళవారం కరపత్రం ఆవిష్కరణ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నూతనంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి పొట్ట కొడుతుందని మండిపడ్డారు. కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్