అనారోగ్యంతో 10వ తరగతి విద్యార్థిని మృతి

అనారోగ్యంతో పదవ తరగతి విద్యార్థిని మృతి చెందిన సంఘటన హవేలీ ఘన్ పూర్ మండలంలో ఆదివారం జరిగింది. సర్దన గ్రామానికి చెందిన పిల్లి కృష్ణ - భాగ్య దంపతులపెద్ద కుమార్తె వెంకటలక్ష్మి (వర్ష) (15) చదువుతోపాటు ఆట పాటల్లో చాలా చురుకుగా ఉండేది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వర్ష హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది.

సంబంధిత పోస్ట్