శంకరంపేట్(ఏ)లో జూదం దాడి 8 మంది అరెస్ట్

జిల్లా శంకరంపేట్(ఏ) మండలం మైసమ్మ గుడి సమీపంలో జూదం ఆడుతున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 46,852 నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ఈ దాడి జరిగింది. అరెస్టయిన వారిని శంకరంపేట్(ఏ) పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్