ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతి

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లాకు చెందిన చింతకింది సాయికిరణ్ అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 2న విధి నిర్వహణలో ఉండగా సాయికిరణ్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దుబాయ్ పోలీసులు ఈ విషయాన్ని చేగుంట పోలీసులకు సమాచారం అందించగా, శనివారం కుటుంబ సభ్యులకు చేరడంతో వడియారం గ్రామం దిగ్భ్రాంతికి గురైంది. భార్య, తల్లిదండ్రులు, ఇద్దరు చిన్న పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్