మెదక్ జిల్లా, శివంపేట్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మేఘవత్ చందర్, పెయింటింగ్ పని చేస్తుండగా 4వ అంతస్తు నుంచి కింద పడిపోయి కాళ్లు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగి ఏడాది గడిచినా పని చేయలేని స్థితిలో ఉన్న చందర్, సొంత ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో, తన తల్లి జేమిలికి అర్హత మేరకు పింఛన్ మంజూరు చేయాలని అధికారులను ఆయన ఆదివారం కోరారు..