ప్రజావాణిలో మూడు రెవెన్యూ సమస్యలపై దరఖాస్తులు

మెదక్ జిల్లా, నిజాంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించిన మూడు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, ఏపీఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕