హవేళిఘన్పూర్ మండలంలో గంగాపూర్ గేటు సమీపంలో ఆటోను డీసీఎం వాహనం ఢీకొనడంతో శేమిన్యాపూర్ గ్రామానికి చెందిన రమేష్, ఎల్లవ్వ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.