ఆటో డ్రైవర్ మోసం.. వృద్ధురాలి బంగారం అపహరణ

వెల్దుర్తి మండలం రామాయపల్లికి చెందిన వృద్ధురాలు రాపర్తి రాజమ్మ పెన్షన్ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా, ఓ ఆటో డ్రైవర్ మాయమాటలతో ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం గ్రామ శివారుకు తీసుకెళ్లి, బెదిరించి ఆమె చెవుల్లో ఉన్న రెండు బంగారు కమ్మలను లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్